హైదరాబాద్: బస్తీవాసుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 9 గంటలకు ఎన్టీఆర్ నగర్‌లోని దర్గా వద్ద ‘బస్తీ దర్బార్–సర్కార్ వద్దకు సామాన్యుల గళం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి ఏర్పుల బాలస్వామి తెలిపారు. ఇంటి స్థలాల పట్టాలు, మౌలిక వసతులు, పారిశుధ్య సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు చామకూర రాజు, రాష్ట్ర ఇంచార్జ్ కే.వి. గౌడ్ తదితరులు పాల్గొంటారని తెలిపారు.